చవటపాలెంలో 10 వాహనాలు స్వాధీనం

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే31 గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చవటపాలెంలో శనివారం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. 23 ఇళ్లను తనిఖీ చేయగా, సరైన పత్రాలు లేని కారణంగా తొమ్మిది మోటార్ సైకిల్ మరియు ఒక కారు నుస్వాధీనం చేసుకోవడం జరిగిందనీ రూరల్ ఎస్సై తిరుపతయ్య తెలిపారు. ఎవరైనా అనుమానితులు సంచరిస్తుంటే వెంటనే తెలియజేయాలని స్థానికులకు ఆయన సూచించారు. నేర నివారణ, రహదారి భద్రత మరియు ప్రజా సహకారం పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నేరవృత్తి మానుకోవాలని రౌడీ షీటర్ లను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *