నాగర్‌కర్నూల్ జిల్లా బీసీ కమిటీ ఉపాధ్యక్షుడిగా అబ్బ కరుణాకర్ ముదిరాజ్, మహిళా జనరల్ సెక్రటరీగా శిరీష అబ్బ నియామకం

బీసీ హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తాం: అబ్బ కరుణాకర్ ముదిరాజ్

పయనించే సూర్యుడు మే 31 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బీసీ కమిటీలో జిల్లా ఉపాధ్యక్షుడిగా అబ్బ కరుణాకర్ ముదిరాజ్, జిల్లా మహిళా జనరల్ సెక్రటరీగా శిరీష అబ్బ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమానికి బీసీ జిల్లా అధ్యక్షుడు అరవింద్ చారి ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నియమితులైన నాయకులను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అబ్బ కరుణాకర్ ముదిరాజ్ మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ, రాజకీయ సాధికారత కోసం కృషి చేస్తామని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం దక్కేలా, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు అయ్యేలా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. బీసీ సమాజ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. మహిళా జనరల్ సెక్రటరీగా నియమితులైన శిరీష అబ్బ మాట్లాడుతూ బీసీ మహిళల సాధికారత, విద్యా, ఉపాధి అవకాశాల పెంపు కోసం పనిచేస్తానని తెలిపారు. మహిళలను సంఘటితం చేసి సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. బీసీ జిల్లా అధ్యక్షుడు అరవింద్ చారి మాట్లాడుతూ నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు పార్టీ, సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. బీసీల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తూ సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రేణుక, విద్యా, రమేష్, కుమ్మరి శ్రీశైలం, సాకలి వెంకటయ్య, రామచంద్రయ్య, లవ్ తదితరులు పాల్గొని నూతన నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *