అభివృద్ధికి అంబాసిడర్ కూటమి ప్రభుత్వం

ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్

పయనించే సూర్యుడు గూడూర్ న్యూస్ జూన్ 2 అభివృద్ధికి అంబాసిడర్ గా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం మేగనూరులో ఆర్ అండ్ బి రోడ్డు నుంచి ఎస్సీ కాలనీ వరకు రూ 20 లక్షల వ్యాయంతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తుందన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం గూడూరు మండలం మేగనూరు గ్రామంలో ఆయన పెన్షన్ నగుదును లబ్ధిదారులకు అందజేశారు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రూ 3000 రూపాయలు ఉన్న పెన్షన్ ను రూ 4000 రూపాయలు లకు పెంచి ప్రభుత్వం అందజేస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *