పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 2 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరియు మంచిర్యాల జిల్లాలోని మండల అధ్యక్ష పదవులలో పట్టణ మున్సిపాలిటీ అధ్యక్ష పదవులలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పద్మశాలి సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమావేశమైన శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు మంచిర్యాల జిల్లాలో 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు తీవ్ర స్థాయిలో కృషి చేసినారని అయినప్పటికీ ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జిల్లా కమిటీలలో కానీ మండల అధ్యక్ష పదవుల్లో కానీ పట్టణ కార్పొరేషన్ అధ్యక్ష పదవుల్లో కానీ పద్మశాలీయులకు సరి అయిన ప్రాతునిధ్యం కలిపించకపోవడం శోచనీయం అని సమావేశం పేర్కోనది అదే విధంగా 1978 నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి మండల పట్టణ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ఉద్యమకారుడిగా తాటిపాముల నాగయ్య పసుపునూరి రంగయ్య ,జంజీరాల రాజం ,మీసాల నర్సయ్య లాంటి ఎందరో నాయకులు తమ చివరశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినారనే విషయాన్ని రాష్ట్ర జిల్లాల నాయకత్వం విశ్వరించడం చాన బాధాకరం అని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు జిల్లా మండల మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ పదవులలో సముచిత స్థానం కల్పించే విధంగా కృషి చేయాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది లేని యెడల రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలలో పద్మశాలీయుల సత్తా ఏమిటో కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా జై మార్కండేయ జై జై బీసీ పద్మశాలీయులారా ఏకం కండి రాజ్యాధికారం లో వాటా కోసం సామాజిక న్యాయం కోసం అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ యొక్క సమావేశంలో మంచిర్యాల జిల్లా శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక అధ్యక్షుడు మరియు బీసీ సంఘాల నాయకుడు గజెల్లి వెంకటయ్య , పద్మశాలి సంఘం నాయకులు వేముల అశోక్, చిప్ప రామస్వామి, జంజీరాల నారాయణ ,అడిచర్ల రాజేశం,పరిసె శ్రీనివాస్, డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..