రాబోయే విద్యా సంవత్సరానికి మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అందించే విషయంలో రాజీ లేదు ఎంఈఓ నాగరాజు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 3 వాత్సవాయి గ్రామంలోని ఈరోజు న ది. 0206.2026 ఉదయం 9 గంటలకు రాబోయే విద్యా సంవత్సరానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అందించే మెనూ విషయంలో రాజీ పడకుండా ఎటువంటి పొరపాట్లు జరగకుండా శుచిగా, శుభ్రంగా వండి వార్చాలని మండలంలో అన్ని పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈఓ లహోరి.నాగరాజు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వత్సవాయి నందు ఓరియంటేషన్ కార్యక్రమమును నిర్వహించడమైనది, ఈ కార్యక్రమము విజయ వాహిని చారిటబుల్ ట్రస్ట్ మరియు టాటా ట్రస్ట్ మరియు జిల్లా విద్యాశాఖల ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆయా ఏజెన్సీలకు శిక్షణ ఇవ్వటమే కాకుండా వంటల పోటీలను కూడా నిర్వహించి బహుమతి ప్రధానం చేయడమైనది ఈ కార్యక్రమంలో విజయ వాహిని చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ అనూష మరియు ఆయా పాఠశాలల ఏజెన్సీ వంట నిర్వాహకు రాళ్లు మరియు సిఆర్పిలు పాల్గొనినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *