పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 3 జగ్గయ్యపేట పట్టణంలోని ఈరోజు న నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా వారు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా నిడుముక్కల శివశంకర్ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన తన్నీరు నాగేశ్వరరావు . ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీ వర్గాలకు ఎల్లప్పుడూ పెద్దపీట వేశారని అన్నారు. రాజకీయ, సామాజిక రంగాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ అనేక కీలక పదవులను అందించారని పేర్కొన్నారు బీసీల అభ్యున్నతికి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎస్సీలకు బీసీలకు 50% రిజర్వేషన్ తీసుకొచ్చిన పూలే మహనీయుడు జగన్మోహన్ రెడ్డి , బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అని నిరూపించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, జిల్లా బీసీ సెల్ విభాగ అధ్యక్షులు మార్తి శ్రీను, నియోజకవర్గ బీసీ సెల్ విభాగ అధ్యక్షులు జవ్వాజీ నరసింహారావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా యువజన ఉపాధ్యక్షులు బజార్ సాయి, నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు డేరంగుల శ్రీనివాసరావు, అనుమంచిపల్లి గ్రామం మాజీ సర్పంచ్ పానుగంటి లక్ష్మీ త్రివేణి-బ్రహ్మనాయుడు మండల బీసీ సెల్ విభాగ అధ్యక్షులు గుడికందుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.