తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరించిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ

పయనించే సూర్యుడు, కోరుట్ల జూన్ 3 కోరుట్ల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ. జెండా కార్యక్రమం అనంతరం కస్తూరి లక్ష్మి నారాయణ మాట్లాడుతూ తెలంగాణా అవతరణ దినోత్సవం అనేది దశాబ్దాల సూదీర్ఘ పోరాటం ఎందరో అమరవీరుల త్యాగాలా ఫలితంగా 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన చారిత్రక ఘట్టం ప్రతి ఏటా ఈ రోజున తెలంగాణా అవతరణ దినోత్సవం వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభావంగా జరుపుకుంటారు. తొలి దశ ఉద్యమం 1969 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రo కోసం 1969 లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అప్పటి ప్రజల ఆకాంక్షను గుర్తించినా అ తర్వాత కాలంలో అది మరుగున పడింది. .మలి దశ ఉద్యమం 2001-2014 లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మళ్ళీ ఊపందుకుంది. విద్యార్థులు, మేధావులు ఉద్యోగులు మరియు సకల జనులు బాగాస్వామ్యమై సుదీర్ఘ కాలం పాటు పోరాటాలు చేశారు.తెలంగాణా సాధిస్తేనే మన బ్రతుకులు బాగుపడతాయి అనే నమ్మకం తో శ్రీకాంత్ చారి లాంటి ఎంతో మంది యువకులు ప్రాణలను త్యాగం చేసారాని గుర్తు చేశారు. అలాగే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన సూదీర్ఘ పోరాటం లో ఎందరో యువత ఆత్మ బలిదానాలు చేశారు. ఈ మహా సంగ్రామంలో పార్లమెంట్ లో తెలంగాణా ఆకాంక్షకు అండగా నిలిచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు గోంతేత్తి నిలిచిన సుష్మస్వరాజ్ పాత్ర చిరస్మరణీయం అని కొని యాడారు.ఇట్టి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రుద్ర శ్రీనివాస్ బీజేపీ కౌన్సిలర్స్ ఇందూరి తిరుముల వాసు, గుగ్లావత్ శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, చెట్ల పెల్లి సాగర్, సీనియర్ నాయకులు సుదవేణి మహేష్, గిన్నెల శ్రీకాంత్, పోతూగంటి శ్రీనివాస్, కాలాల సాయి చందు ,తులసి కృష్ణ, బేక్కం అశోక్ ,మ్యకల గణేష్ ,గుండేటి రాజేందర్ ,సాడిగే మహేష్ ,తలపెల్లి శ్రీనివాస్ ,ఓం ప్రకాష్ ,సోరుపాక రమేష్ ,గుండేటి సంజీవ్ ,ధమ్మా సంతోష్ ,మైదాం సత్యనారాయణ ,కచ్చు రమేష్ ,మామిడి మల్లేష్ , కస్తూరి జ్ఞానేశ్వర్ ,దామ శ్రవణ్ ,అక్మాల్ ,కైరం కొండా రాజా గంగాధర్ ,అక్కేనాపెళ్ళి వెంకటరమణ ,గొనె రాజారామ్ ,గడ్డం రాజశేఖర్ ,చింతకింది గోపాల్ ,ఉప్పులిటి రాఘవులు ,ఒళ్ళోజీ నగేష్ ,బాల్క ప్రేమ్ సాగర్ ,మరియు బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *