సొంతింటితో కుటుంబానికి భద్రతఎల్లమ్మ తల్లి బోనాల జాతర.

పయనించే సూర్యుడు న్యూస్:జూన్/04: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సొంత ఇళ్లతో కుటుంబాలకు భద్రత చేకూరుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ మండలం వెల్ది గ్రామంలో జరిగిన పలు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేసి, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుందన్నారు. అందుకే ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా వేలాది మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. వెల్ది గ్రామంలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకుని గృహప్రవేశం చేస్తున్న కుటుంబాలు అభివృద్ధికి ప్రతీకలని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్య, వైద్య రంగాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి కొనసాగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ విజయ్ కుమార్, గ్రామ పెంచాల సర్పంచ్ కిషన్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎన్.బాపురావు, పార్టీ నాయకులు గుజ్జ ప్రభాకర్, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, తోట శ్రీనివాస్, కోండ్ర సురేష్, తాళ్లపల్లి నరేష్, శంకర్, రామిడి తిరుపతి, సాయిరి దేవయ్య, కానిగంటి రమేశ్, కనకం కుమార్, మాతంగి సహదేవ్, బందెల మహేందర్, తోపాటు వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మద్దికుంటలో…. మానకొండూర్ మండలం మద్దికుంట గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న ఎల్లమ్మ తల్లి బోనాల జాతరకు బుధవారం మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఎల్లమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. జాతరలో పాల్గొన్న భక్తులతో కలిసి ఆయన అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి చల్లని చూపు, కరుణ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గ్రామాలు సుభిక్షంగా ఉండి, రైతులు పంటలతో కళకళలాడాలని, యువత ఉపాధి అవకాశాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని పేర్కొంటూ, ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. జాతరను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలను ఎమ్మెల్యే అభినందించారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఓదెలు గౌడ్, మద్దికుంట గ్రామ సర్పంచ్ బుర్ర శ్రీధర్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు బుర్ర శ్రీకాంత్, అచ్యుత్ గౌడ్, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, తోట శ్రీనివాస్, నాగిశెట్టి రాజయ్య, దూలం దేవేంద్ర, వీరస్వామి, సహదేవ్, సాయిరి దేవయ్య, కానిగంటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *