ఒకప్పుడు వేసవి కొన్ని వారాలే ఇప్పుడు నెలల తరబడి మండుతున్న ఎండలు

హైదరాబాద్ నగరంపై కరుణ చూపని భానుడు.. నిప్పుల కుంపటిగా మారిన వీధులు

పయనించే సూర్యుడు జూన్ 05 (హైదరాబాద్ మాధవరెడ్డి ) ఒకప్పుడు వేసవి అంటే ఏప్రిల్ మే నెలల్లో కొన్ని వారాల పాటు ఎండలు మండటం సహజం. కానీ 2026లో హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఈసారి నగరంపై సూర్యుడు కరుణ చూపలేదనే చెప్పాలి. ఉదయం మొదలైన వేడి అర్ధరాత్రి దాటినా తగ్గకపోవడంతో లక్షలాది మంది నిద్రలేని రాత్రులు గడిపారు. పగటిపూట రోడ్లపై అడుగు పెట్టడం కష్టమైతే.. రాత్రి వేళల్లోనూ ఉక్కపోత నుంచి ఉపశమనం దొరకలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 1 వరకు హైదరాబాద్‌లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన రోజులు ఏకంగా 47. గతంలో అత్యంత తీవ్రమైన వేసవిగా గుర్తింపు పొందిన 2015లో కూడా ఈ సంఖ్య 42 రోజులు మాత్రమే. అంటే పదేళ్ల క్రితం నమోదైన రికార్డును 2026 అధిగమించింది. మరోవైపు 2021లో కేవలం మూడు రోజులు మాత్రమే 40 డిగ్రీల మార్క్‌ను దాటడం పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయో తెలియజేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *