గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 5 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గోపన్నగూడెం గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల జాతర (మినీ మేడారం) గ్రామస్తుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది ఈ సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి జాతరలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సమ్మక్కసారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్ర రావు జిల్లా పీసీసీ ప్రముఖులు తుమ్మా రాంబాబు జిల్లా పీసీసీ సభ్యులు కోలా లక్ష్మీనారాయణ సర్పంచ్ అలీబాబు సంక్రురావు ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *