పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 5 బోధన్ : బోధన్ రూరల్ ఎస్సైగా ఉత్తమ సేవలు అందించి బదిలీపై వెళుతున్న ఎస్సై మచ్చెందర్ రెడ్డిని గురువారం సాలూర మండల బోధన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు.ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించిన ఎస్సైని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.పోలీస్ శాఖలో మంచి పదోన్నతులు పొంది ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మందర్న రవి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కల్దుర్కి గ్రామ సర్పంచ్ నరేందర్ ప్రకాష్ పటేల్ ఖాజాపూర్ అశోక్ ప్రకాష్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు