చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా విద్యాలయం యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్లు

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 6 గూడూరు రెండో పట్టణ పరిధిలోని బ్రాహ్మణ సేవా సంఘం కళ్యాణ మండపంలో కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా విద్యాలయం యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్ల కార్యక్రమం నిర్వహించారు ముఖ్యఅతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కంచి కామకోటి పీఠం జగద్గురు శ్రీ శంకరాచార్య స్వాములవారి మార్గదర్శకం తో యువతకు క్రమశిక్షణ , విలువలతో కూడిన విద్యను అందించాలని లక్ష్యంతో యూనివర్సిటీ స్థాపించామని తెలిపారు అలాగే పేద విద్యార్థులకు ఫీజు రాయితీ ఇస్తున్నామని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు ఆనిమెళ్ళ శివకుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా విలువలతో కూడిన విద్యను అందించాలని లక్ష్యంతో యూనివర్సిటీ స్థాపించడమే కాకుండా పేద విద్యార్థులకు ఫీజు రాయితీ ఇవ్వడం ఎంతో అభినందనీయమని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిన్ వెంకటరమణ , సురేంద్ర మైధిలి ,బ్రాహ్మణ సంఘ సభ్యులు లలితమ్మ , పురుషోత్తం, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *