పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్.06.06.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// నవ చేతన అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిన్నారుల సమగ్ర వికాసం మరియు సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన ఒక వినూత్న కార్యక్రమం. ఇఃదులో భాగంగా మండలంలోని చారాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు మండలంలోని 33 సెంటర్ల అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్స్ గా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ మోనా, సూపర్ వైజర్లు రాధా, సులోచన పాల్గొన్నారు.ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు వివరాలు నవచేతన యాప్ చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలను ట్రాక్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ‘నవచేతన యాప్’ను ఉపయోగిస్తున్నారు.పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యుపరమైన సమస్యలు,వైకల్యాలు,అభివృద్ధిలో అలసత్వం వంటి వాటిని ఈ యాప్ ద్వారా ముందుగానే గుర్తిస్తారు.పిల్లల అభివృద్ధిని స్థూల,సూక్ష్మ చలన నైపుణ్యాలు, భాషాభివృద్ధి, జ్ఞానాత్మకత,మరియు సామాజిక-భావోద్వేగం అనే 5 అంశాల ద్వారా అంచనా వేస్తారు.దీనికోసం ప్రభుత్వం నవ చేతన చిన్న పిల్లల సంరక్షణకుమరియు ‘ఆధార్ శిల’ (3-5 ఏళ్ల పిల్లలకు) పేర్లతో ప్రత్యేక పుస్తకాలను అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది. మొదటి రోజు శిక్షణా కార్యక్రమంలో 33 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.