బసిరెడ్డిపల్లి సర్పంచ్ కి కొమ్మూరి ఆర్థిక సహాయం

పయనించే సూర్యుడు, జూన్ 6, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ సిద్దినర్సమ్మ మల్లయ్య ల ఏకైక కుమారుడు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదడంలో కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జనగామ నియోజక వర్గ ఇంచార్జి మాజీ ఏం యల్ ఏ కొమ్మూరి ప్రతాపరెడ్డి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆలింపూర్ మాజీ ఎంపీటీసీ మొహమ్మద్ మసూద్ ద్వారా పంపించారు. తద్వారా బాధిత కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమలో బచ్చనపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు, మాజీ ఎంపీటీసీ నల్లగొని బాలకిషన్, కొడవటూరు దేవస్థానం మాజీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి దత్తరపు నరేష్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పిన్నింటి నారాయణరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గార్లపాటి మహిపాల్ రెడ్డి, బసిరెడ్డిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు బాలగోని కనకయ్య, పెద్దటి శ్రీను, వెంకటయ్య, బొట్టు గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *