బోటనీ పాఠ్యపుస్తక ఆవిష్కరణ

పయనించెే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్, జూన్ 07 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, ప్రభుత్వ జూనియర్ కళాశాల రాయికల్ పూర్వ విద్యార్థి, పూర్వ అధ్యాపకుడు మరియు ప్రస్తుతం కరీంనగర్‌లోని ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల బోటనీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డా.పడాల తిరుపతి శనివారం రాయికల్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలను మర్యాదపూర్వకంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్మీడియట్ బోటనీ పాఠ్యపుస్తకాన్ని ఆవిష్కరించారు.ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోటనీ పాఠ్యపుస్తక సబ్జెక్ట్ కమిటీ సభ్యునిగా సేవలందిస్తున్న డా. తిరుపతి కళాశాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అధ్యాపకులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. విద్యార్థుల విద్యా నాణ్యత పెంపు, బోధనలో నూతన విధానాల అమలుపై విలువైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా తమ కళాశాల పూర్వ విద్యార్థి, పూర్వ అధ్యాపకుడు రాష్ట్రస్థాయిలో విశిష్ట సేవలు అందించడం గర్వకారణమని ప్రిన్సిపాల్ ఎస్. నిర్మల పేర్కొన్నారు. అనంతరం అధ్యాపక బృందం డా. తిరుపతిని శాలువాతో ఘనంగా సత్కరించింది.ఈ కార్యక్రమంలో ఏజీఎంసీ సభ్యుడు జె. రాజేష్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. కళాశాల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపునకు డా. తిరుపతి అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *