పయనించే సూర్యుడు జూన్ 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మల్లేపల్లి తిరుపతయ్య) సురోభారతి కళా కేంద్రం, కోల్‌కతా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కళాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన ఆల్ ఇండియా టాలెంట్ సర్చ్ పోస్టల్ పోటీల్లో చేజర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ డ్రాయింగ్ మాస్టర్, అంతర్జాతీయ కళాకారుడు తోట కిషోర్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించారు. మే 15 నుంచి నిర్వహించిన ఈ పోటీలకు మే 30లోపు అందిన పెయింటింగ్స్‌ను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. తోట కిషోర్ కుమార్ సాధించిన ఈ విజయంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు.