ఫరూఖ్‌నగర్ మండలంలో ప్రీ-ప్రైమరీ తరగతులకు ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకం.

జనం న్యూస్ 07 జూన్ 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్, సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ సమి : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలంలోని వెలిజర్ల గ్రామం ప్రాథమిక పాఠశాలతో పాటు షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్ కాలనీ, క్రిస్టియన్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, వెంకటేశ్వర కాలనీ ప్రాథమిక పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి మనోహర్ తెలిపారు. ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్ అర్హత, ఆయా పోస్టుకు ఏడవ తరగతి అర్హతగా నిర్ణయించారు. టీచర్ ట్రైనింగ్ (డీఎల్‌ఎడ్ /డీఈడ్) అర్హతలు కలిగిన వారికి, అలాగే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ బుధవారం సాయంత్రంలోపు మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) ఫరూఖ్‌నగర్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు మరిన్ని వివరాలకు ఫోన్ : 9603554546 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *