జనం న్యూస్ మధిర జూన్ 7 దోర్నాల కృష్ణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు యడ్లపల్లి నాగయ్య వారి పార్థివదేహానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు కర్నాటి రామారావు, పులిబండ్ల చిట్టిబాబు గ్రామ సర్పంచ్ పగిడిపల్లి శ్రీనివాసరావు మరియు గ్రామ పెద్దలుతదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగయ్య వారి సేవలను స్మరించుకున్న నాయకులు, పార్టీ అభివృద్ధికి ఆయన అందించిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.