జర్నలిస్టులకు ప్రైవేట్ స్కూల్లో ఫీజు రాయితీ కల్పించాలి

టిడబ్ల్యూజెఎఫ్ మేడ్చల్ నియోజకవర్గం కన్వీనర్ అంబాల విష్ణు.

జనం న్యూస్ జూన్ 7:- కీసర సర్కిల్ జవహర్ నగర్ , తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టి.డబ్ల్యూజే.ఎఫ్)మేడ్చల్ నియోజకవర్గం కన్వీనర్ గా అంబాల విష్ణు ఎన్నిక అయ్యారు. ఎన్నికైన సందర్భంగా తాను మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు రాయతీలను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అమలు చేయాలని కోరారు. రాజ్యాంగం అమలులో నాలుగవ స్థంబంగా నిలువాల్సిన జర్నలిస్టుల పరిస్థితి నేడు దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుబాల పరిస్థితి ఆర్థిక ఇబ్బందులతో సతమౌతుంటే పట్టించుకునే నాథుడే కరువైనారని తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టులకు కల్పిస్థామని ప్రకటించిన వాటిని వెంటనే ప్రకటించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *