రైతు-కూలీ సంఘం రాష్ట్ర సదస్సు జయప్రదం చేయండి.

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 8 మండల ప్రతినిధి బొద్దుల భూమేష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని ప్రెస్ క్లబ్ వద్ద రైతు-కూలీ సంఘం రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమం కు రైతు కూలీ సంఘం యు రాష్ట్రప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం ముఖ్య అతిధి గా హాజరై పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం వెల్తురు సదానందం మాట్లాడుతూ కేంద్రం లోని మోడీ సర్కార్ రైతంగాన్ని చిన్నభిన్నాం చేసే కుట్రలకు పాల్పడుతుందన్నారు. స్వేచ్చా వాణిజ్యం పేర ఇంగ్లాడ్,అమెరికా దేశాలతో చేసుకున్న ఒప్పందాలను మనదేశ రైతులకు కౌలు రైతులకు, కూలీల మెడకు ఊరి తాళ్ళుగా మారబోతున్నయని తనభూమిలోనే తనే కూలీగా రైతును నిలిపే మోడీ సర్కార్ కుట్రలకు వ్యతిరేకంగా రైతంగా ఆందోళనలు నిర్వహించాల్సిన సమయం ఇదే అన్నారు. రైతంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం భవిష్యత్ పోరాటాలను రూపొందిచుకొనేందుకు రైతు-కూలీ సంఘం హైదరాబాద్,కాచిగూడ తుల్జా భవన్ లో తేదీ 9,10 వ తేదీల్లో సదస్సు నిర్వహించపడుతుందని సదస్సు జయప్రదం కోసం జిల్లాలోని రైతు -కూలీలు అధికసంఖ్యలో తరలి రావలసిందిగా పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రైతుకూలీ సంఘం నాయకులు సిహెచ్.నరేందర్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మండల యుగేందర్,అల్లాడి వెంకన్న,అజిమిరా పవన్, ఏ ఐ ఎఫ్ టీ యు నాయకులు చంద్రగిరి శంకర్ మరియు (స్త్రీవిముక్తి )నాయకురాలుదేవక్క పాల్గొన్నారు. విప్లవాభివందనలతో సిహెచ్.నరేందర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ రైతు-కూలీ సంఘం నాయకులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *