పయనించే సూర్యుడు జూన్ 9 ఆదోని రూరల్ రిపోర్టర్ కర్నూలు జిల్లా కురువ సంఘ అధ్యక్షులు కురువ మల్లికార్జున ఆధ్వర్యంలో ఆదోని బీరప్ప దేవస్థానం నందు నూతనంగా మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కమిటీకి ముఖ్య అతిథులుగారాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురువ కురుమ సంఘ అధ్యక్షులు మల్లికార్జున పాల్గొన్నారు, ఆదోని నియోజకవర్గం లో ఆదోని మండలం, పెద్ద కడుబూరు మండలం, ఆస్పరి, మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది, అధ్యక్షులను మరియు ప్రధాన కార్యదర్శులను కురుబ కులం అభివృద్ధి కోసం మరియు కురుబ ఉన్నతి కోసం యువకులను ఎన్నుకోవడం జరిగింది, ఇందులో ఆదోని నియోజకవర్గం అధ్యక్షులుగా కురువ రాఘవేంద్ర ఆదోని మండల అధ్యక్షులుగా చాగీ మల్లికార్జున పెద్దకడబూరు మండల అధ్యక్షులుగా యు రామలింగ మరియు ఆస్పరి మండల అధ్యక్షులుగా బత్తిని జీవన్ కుమార్ లను ఎన్నుకోవడం జరిగింది, వీళ్ళకి కురుబ సంఘ గ్రామ కమిటీల బాధ్యత అప్పగించినారు, దీనికి నలుగురు అధ్యక్షులు సానుకూలంగా స్పందించారు, తర్వాత కుల పెద్దలు మాట్లాడుతూ కుల అభివృద్ధి కోసం సలహా సూచనలు ఇచ్చినారు, చివరిగా రాష్ట్ర చైర్మన్ దేవేంద్రప మాట్లాడుతూ కురుబల అభివృద్ధి కోసం కురుబల ఉన్నతి కోసం కురుబల హక్కుల కోసం దాదాపు 30 సంవత్సరం నుంచి పోరాడుతూనే ఉన్నాము, ఇప్పుడిప్పుడే మన కురుబలను ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి, కురుబలు ఏకతాటిగా ఒక్కటిగా కలిసికట్టుగా నడుచుకుందామని కురుబ సోదరులకు తెలియజేశారు, పోయిన ఐదు సంవత్సరం నుంచి కర్నూలు జిల్లాలో కురుబలు ఉన్నాము మాకు రాజకీయంగా ఎదగడానికి ఎమ్మెల్యే గాని ఎంపీ గాని టికెట్ ఇస్తే గెలిచి ఆ పార్టీకి బహుమతిగా ఇస్తామని ఎన్నోసార్లు కార్యక్రమాలు జరుపుకున్నాం, మా అదృష్టం కర్నూలు జిల్లా ఎంపీగా కురుబ సోదరుడు బస్తిపార్టీ నాగరాజు కి ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించి మన సత్తా ఏంటో చూపించాము, రాబోయే రోజుల్లో ఇలాగే మనం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని సభాముఖంగా తెలిపినారు, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే టికెట్లు కూడా సాధించుకొని రాజకీయపరంగా ఎదగాలని కురుబ సోదరులను కోరినారు, కురుబల అంటే ప్రతి ఒక్క కులం మాకు సపోర్టుగా నిలుస్తున్నాయి అని పేర్కొన్నారు, ఈ కమిటీ కార్యక్రమానికి ఆదోని డివిజన్ కురుబ కులస్తులు బత్తిని వెంకటరాముడు, జిల్లా ఉపాధ్యక్షుడు బి పి నాగరాజు, నాగరాజుగౌడ్, బత్తిని కుబేర్నాథ్, కోటిగి సంతోష్, కౌతాళం వీరేష్ ఎక్స్ ఎంపీపీ రఘురాం, ఎల్లార్తి దర్గన్న, కర్నూల్ మహేంద్ర, తిరుపతి శ్రీనివాసులు, అనంతపురం రాజగోపాల్, మరియు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు వచ్చిన కురుబ పెద్దలు సోదరులు యువకులు పాల్గొని విజయవంతం చేసినారు.