విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయం.. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు.. మున్సిపల్ కమిషనర్ మనోహర్

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 12 మామిడిపెల్లి లక్ష్మణ్ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ మనోహర్ అన్నారు. రాయికల్ పట్టణంలో “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా బుధవారం 10వ వార్డు లో “వార్డు సభ”ను మేరు సంఘ భవనంలో నిర్వహించారు. వర్షాకాలంలో ఏర్పడే ముందస్తు చర్యలు,తడి చెత్త -పొడి చెత్త సేకరణ,పర్యావరణ పరిరక్షణ,నీటి పొదుపు,ఇంకుడు గుంతల ఏర్పాటు,మహిళల సంరక్షణ,అరైవ్ -ఎలైవ్,ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.మహిళ గ్రూప్ సభ్యులకు ఇందిరమ్మ చీరను పంపిణీ చేశారు.వార్డు లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించారు.ఇందిరమ్మ ఇండ్లు, నూతన పెన్షన్ పథకాల కోసం వచ్చిన దరఖాస్తులను స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు.అనంతరం పదో వార్డు కౌన్సిలర్ మచ్చ గంగలక్ష్మి ఆధ్వర్యంలో పదవ తరగతి,ఇంటర్మీడియట్,పాలిటెక్నిక్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది విద్యార్థులను సాల్వతో ఘనంగా సన్మానించి కాలేజీ బ్యాగులను అందించారు.10మంది చిన్నారులకు పలక,వాటర్ బాటిల్, స్లేట్ పెన్సిల్ బాక్స్ అందించి అక్షరాభ్యాసం చేయించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ
విద్యార్థులు,యువత ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలంటే విద్య ఒక్కటే మార్గమని అలాంటి విద్యను ప్రణాళికతో చదివితే ఫలితాలు సాధించవచ్చని అన్నారు.తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను వృధా చేయకుండా కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు.విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వారికి ఇష్టం ఉన్న రంగాన్ని ప్రోత్సహించి విజయం సాధించేలా తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు తోడ్పాటు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ మచ్చ గంగలక్ష్మి,జూనియర్ అసిస్టెంట్ హరీష్, సుష్మ,వార్డు అధికారి ప్రత్యూష, నాయకులు మచ్చ శేఖర్, బాపురపు నరసయ్య,రాజీవ్,లింగంపల్లి సుభాష్,కాశవేణి రాజేష్,రాంప్రసాద్,గంగారెడ్డి, మల్లేష్, మెప్మా సుజాత ,అనూష, శ్యామల, అంగన్వాడి ఉపాధ్యాయులు ఉమా,పుష్పలత,ఏ ఎన్ ఎం ఫాతిమా,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *