పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 13 పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామ పరిధిలో ఉన్న మునేటి కాలవపై ఉన్న కట్ట గ్రావెల్ను అక్రమంగా గింజుపల్లి వీరభద్రం అక్రమ ప్రైవేటు వ్యక్తులకు అమ్మి సొమ్ము చేసుకున్నారని ప్రభుత్వానికి ఆ గ్రామ రైతు యానాల కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. వేలాది ఎకరాలకు నీరందించే మునేటి కాలమని ప్రభుత్వ నిధుల ద్వారా పటిష్ట పరిచేందుకు కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేశారని అలాంటి విలువైన కాలువ కట్ట గ్రావెల్ను వీరభద్రం జెసిబి ఇతర వాహనాల సహకారంతో ప్రైవేటు వ్యక్తులకు అమ్మి వేయడం జరిగిందని దీని వలన కాలవ కట్ట రూపురేఖలు మారిపోయి రైతాంగానికి తీవ్ర నష్టం జరగనుందని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసిన మెదట మైనర్ ఇరిగేషన్ అధికారులు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని దానిలో గింజుపల్లి వీరభద్రం అనేవారు కాలవకట్టను ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తించామని, వారితోనే తిరిగి మరల మరమ్మత్తులు చేయించడం జరిగిందని పేర్కొనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వాస్తిని ధ్వంసం చేసి విలువైన గ్రావెల్ను అమ్మి సొమ్ము