చింతకానిలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తా: ఎస్సై జి. నరేష్

* చింతకానిలో కొత్త ఎస్సై జి. నరేష్‌కు బీఆర్ఎస్ నాయకుల మర్యాదపూర్వక స్వాగతం

పయనించే సూర్యుడు జూన్ 13, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని, జూన్ 12: చింతకాని పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై జి. నరేష్‌ను బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మంకెన రమేష్, మండల కార్యదర్శి బొడ్డు రామారావు, మాజీ వైస్ ఎంపీపీ గురుజాల హనుమంతరావు, మాజీ సొసైటీ డైరెక్టర్ వంకాయలపాటి లచ్చయ్య, పొనుగంటి రత్నాకర్, గోగుల నరసింహారావు, చాపలమడుగు వీరబాబు, గడ్డం శ్రీను, చాట్ల సురేష్, కొండ గోపి, కొండూరు పరిశుద్ధరావు, జమలయ్య, అయ్యారి సాయి, సామినేని అప్పారావు, కోటయ్య, బిందెల శ్రీను, కొండలు, ఉపసర్పంచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై జి. నరేష్ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలను పటిష్ఠంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలతో సమన్వయం కొనసాగిస్తూ న్యాయబద్ధంగా విధులు నిర్వర్తిస్తానని, చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు.గ్రామాల్లో ఎక్కడైనా అక్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.మండలంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని ఎస్సై నరేష్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *