ఈరోజు తిరుపతిలో జరిగిన ఎన్డీఏ కూటమి కార్యక్రమం అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ వారితో కలసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి, మంత్రి నారా లోకేష్ వారికి పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సిరివేలు చిన్న రాయల్ మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారు.

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 13.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ// ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు సుస్థిర పాలన దిశగా చేస్తున్న కృషికి తమ పూర్తి మద్దతు ఉంటుందని చిన్న రాయల్ తెలిపారు. రాష్ట్ర పురోగతికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *