తెలంగాణ నీటి హక్కులను కాపాడాలి.. జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఆయకట్టుకు సాగునీరు అందించాలి: మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం డిమాండ్

పయనించే సూర్యుడు,జూన్ 14 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రధాన నినాదాలపై సాగిందని అందులో ముఖ్యమైన నీటి హక్కుల పరిరక్షణను కాపాడటంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం విమర్శించారు కృష్ణా గోదావరి నదులు తెలంగాణ గుండా ప్రవహిస్తున్నప్పటికీ గతంలో ఈ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా అన్యాయంగా నిర్లక్ష్యం చేయబడిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి – బనకచర్ల – కావేరి లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నదిలో తెలంగాణకు లభించాల్సిన 213 టీఎంసీలు అలాగే కృష్ణా నదిలో 90 టీఎంసీల నీటి వినియోగ అవకాశాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై నిర్లక్ష్య వైఖరి అవలంబించడం బాధాకరమన్నారు జహీరాబాద్ నియోజకవర్గం కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తరించి ఉందని ఇక్కడ 76 సాగునీటి చెరువులు వాటి కింద 12,265 ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ ప్రస్తుతం కేవలం 2,935 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతున్నదని మిగతా ఆయకట్టు నిరుపయోగంగా మారిందని చెప్పారు ఈ చెరువుల నిర్వహణ కోసం జహీరాబాద్‌లో ఒక ఇరిగేషన్ డివిజన్ ఏర్పాటు చేయబడిందని ఇందులో 1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 4 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు 12 ఏఈ/ఏఈఈలు సుమారు 30 మంది సాంకేతిక సిబ్బంది 15 మంది పరిపాలనా సిబ్బంది పనిచేస్తున్నారని వీరి నిర్వహణకు సంవత్సరానికి సుమారు రూ.4 కోట్ల ప్రజాధనం ఖర్చవుతున్నా కాలువల దుస్థితి చెరువుల బండల బలహీనత నీటి పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ఆయకట్టు విస్తరణ జరగడం లేదని మండిపడ్డారు ప్రజాధనం ఖర్చవుతున్నా రైతులకు తగిన ప్రయోజనం అందడం లేదని అందువల్ల ప్రభుత్వం వెంటనే చెరువుల మరమ్మతులు చేపట్టాలని కాలువలను పునరుద్ధరించాలని కొత్త సాగునీటి పనులకు నిధులు మంజూరు చేయాలని అందుబాటులో ఉన్న సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శివకుమార్ ఎస్.గోపాల్ ఎస్.వెంకట్ వీర్ శెట్టి మేఘనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *