రాయలసీమ యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ పై సమగ్రమైన విచారణ జరిపించాలి

* యూనివర్సిటీలో వారు చేసిన దోపిడీపై ప్రశ్నించినందుకు విద్యార్ధి సంఘాల నాయకులు పై కేసుల..??* * త్వరలో వీసీ మరియు రిజిస్టర్ అవినీతి పై విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తాం * ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది డిమాండ్.

పయనించే సూర్యుడు జూన్ 14 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. రాయలసీమ యూనివర్సిటీ లో అవినీతి అక్రమాలు పాల్పడుతున్న వీసీ మరియు రిజిస్టర్ పై సమగ్రమైన విచారణ జరిపించి ఆర్పిఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగరాజు మరియు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ పై పెట్టిన కేసులా ను ఎత్తివేయాలని ఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది డిమాండ్ చేశారు* . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీ లో గత కొన్ని నెలలు గా వీసీ మరియు రిజిస్టర్ చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నించినందుకు ఆర్ పి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగరాజు పై వీసీ కేసులు పెట్టడం జరిగింది అలాగే ఇతర విద్యార్ధి సంఘాలను యూనివర్సిటీ నుంచి తొలగించడం సిగ్గుచేటు అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు . గత నెలలో వీసీ, రిజిస్టర్ అక్రమాలు పై జిల్లా మంత్రి టీజీ భరత్ కి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంపై స్పందించిన మంత్రి వెంటనే రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డిజిపి కి మంత్రి లెటర్ నుండి సిఫారసు లేఖ రాయడం జరిగింది . అయ్యా రాయలసీమ యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ కి మీకు సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ సప్లి నిర్వహించండి అనేది నేరమా యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థికి అగ్ని వీర్ లో ఉద్యోగం వచ్చిందని అందుకు బోనఫైడ్ కావాలని అడుగగా ఇవ్వం అన్నందుకు ఎందుకు ఇవ్వరు అన్నందుకు నేరమా యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విద్యాశాఖ మంత్రి కి వివరిస్తాం అని తెలపడం నేరమాతరచూ యూనివర్సిటీ వ్యవహారం పేపర్లలో వస్తుంది అవినీతి అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్టర్ను తన మాతృ సంస్థకు పంపండి అని అడగడం నేరమాయూనివర్సిటీలో నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయి దీనిపై విచారణ చేయండి అని చెప్పడం తప్ప ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఆలోచించండి అని అడగడం నేరమైందా అంటూ అదే విధంగా కొంతమంది అవినీతి అధికారులు మళ్ళి తప్పుదోవ పట్టిస్తున్నారు సార్ వీటన్నింటిపై ప్రభుత్వం నికి తెలపడంతో పాటు మంత్రికి వివరిస్తాం అంటుంటే సెక్యూరిటీతో గెంటేంచడం ఎంతవరకు న్యాయమని ఆలోచించాలని అంటే ఇది నేరమా*ఇప్పటికి అయినా ఈ విషయం పై ప్రభుత్వం స్పందించకపోతే ఇతర విద్యార్థి సంఘాలను యువజన సంఘాలను కలుపుకొని రాయలసీమ యూనివర్సిటీ ముట్టడించి వాస్తవాలు బయటపెడతామని తెలియజేస్తున్నాం. యూనివర్సిటీలో వీసీ మరియు రిజిస్టర్ అవినీతి అక్రమాలపై విద్య శాఖ మంత్రి నారా లోకేష్ కి మరియు గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో నాయకులు నర్సింహా నాయుడు, మహబూబ్, లక్ష్మన్న, షైక్ష వలి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *