జడ్.పి.హెచ్.ఎస్ కోరపల్లి పాఠశాల పునఃప్రారంభం.

- తొలిరోజే పాఠ్యపుస్తకాల పంపిణీ.

పయనించే సూర్యుడు జూన్ :16 హుజురాబాద్ ఇంచార్జ్ బండ శివానంద రెడ్డి : జడ్.పి.హెచ్.ఎస్ కోరపల్లి పాఠశాలలో ఈరోజు పండుగ వాతావరణంలో పాఠశాల పునః ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా తరగతి గది దర్వాజలకు మామిడి తోరణాలతో అలంకరించి విద్యార్థులకు స్వాగతం తెలపడం జరిగింది. ఈరోజు హాజరైన విద్యార్థులందరికీ ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్ బుక్కులు అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కేతిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పౌష్టికాహార పథకాన్ని మరియు ఇతర పథకాలన్నింటినీ గ్రామంలోని పౌరులు వాడుకుంటూ వారి పిల్లలను కొరపెల్లి ఉన్నత పాఠశాలకు పంపించాలని కోరడం జరిగింది ..విద్యార్థులకు అమ్మాయిలకు ప్రత్యేకంగా కరాటే శిక్షణ ఇంకా ఆటలలో జాతీయ స్థాయికి తీసుకెళ్లడం వివిధ సబ్జెక్టులలో జిల్లా స్థాయికి ఎంపిక కావడం విద్యార్థులు ఎన్.ఎం.ఎం.ఎస్ .కు ఎంపిక కావడం లాంటివి మన కోరపల్లి పాఠశాలలో ఎన్నో అచీవ్మెంట్స్ సాధించడం జరిగింది అని తెలిపినారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం పి. రాజయ్య, పి .శ్రీనివాస్, ఏ. నరహరి, సి. రవికాంత్ రాజు, పి. రాజు, కె. పద్మ ,జి. శ్రీను, పి. కుమారస్వామి, పి. విజేందర్ రెడ్డి ,శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *