వెంగలాపురం ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా పాడేగల్ శ్రీధర్ నియామకం

పయనించే సూర్యుడు జూన్ 16 ఆదోని నియోజకవర్గం రూరల్ రిపోర్టర్ ఆదోని మండలంలోని అతి పురాతనమైన వ్యాసరాయులు ప్రతిష్టాపిత వెంగళాపురం ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా పాడేగల్ శ్రీధర్ ను కూటమి ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దేవాలయం కమిటీకి దాదాపుగా పది సంవత్సరాలుగా పాలకమండలినీ గత ప్రభుత్వాలు నియమించలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దేవదాస్ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, దేవాలయాల ఆస్తులకు పరిరక్షణకు ప్రత్యేక సర్వ చూపుతోంది. గతంలో ఈయన ఏబీవీపీ, విశ్వహిందూ పరిషత్, పనిచేస్తూ సమాజంలో అనేక సామాజిక సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిజెపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *