ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప

పయనించే సూర్యుడు జూన్ 16 ఆదోని రూరల్ రిపోర్టర్. రెండేళ్ల సుపరిపాలన ప్రజలతో పంచుకున్న కర్నూలు జిల్లా కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అవడంతో కర్నూలు జిల్లా కూటమి నాయకులు ప్రభుత్వ పథకాలను మరియు అభివృద్ధిని ప్రజలతో పంచుకున్నారు, ఈ సంతోష కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కిష్టమ్మ, ఎమ్మెల్యేలు దస్తగిరి శ్యాంబాబు, జయ నాగేశ్వరరావు, పార్థసారథి, గౌరు చరిత, ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, రాఘవేందర్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు మాన్వి దేవేంద్రప్ప, కప్పట్రాల్ బుజ్జమ్మ, మరియు టిడిపి నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం సక్సెస్ అయింది, అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజలకు అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ప్రజల పార్టీగా నిలిచింది,* రెండేళ్లలో ప్రజలు సంతోషంగా ప్రభుత్వాన్ని నమ్ముకుని సంక్షేమ పథకాలను అందుకుంటూ పార్టీకి అండగా నిలిచారు, అలాగే ఇచ్చిన ప్రతి మాట ప్రజలకు సకాలంగా నెరవేరుస్తూ వస్తున్నారు, మన యువగళ నాయకుడు ఐటి మంత్రి నారా లోకేష్ బాబు ఎంతో శ్రమిస్తూ రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులను తీసుకురావడంలో దేశంలోనే యువ శక్తిగా మారినారు* మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గ్రామాలను స్వర్ణ గ్రామాలుగా* తీర్చిదిద్దుతున్నారు కేవలం ప్రజల కోసమే ప్రజల సంక్షేమ కోసమే కూటమి ప్రభుత్వం నాయకులు పనిచేస్తున్నారు అని ఆనందం ప్రజలతో వ్యక్తం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *