సేవే ఆదర్శంగా పనిచేస్తున్న సాయిరాం దంపతులు..

పయనించే సూర్యుడు జూన్ 16, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఆదర్శ దంపుతుల్లా దేన్నీ ఆశించకుండా దాహార్తిస్తున్న మీనాక్షి రాంబాబు దంపతుల సేవలు అభినందనీయమని ప్రముఖ రోటరీ బ్లడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు శ్రీకృష్ణ అన్నారు. కాకినాడ రూరల్ మండలం ఏపీఐఐసీ ఎదురు మెయిన్ రోడ్డు శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయం వద్ద 58వ రోజు మజ్జిగ చలివేంద్రాన్ని కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రోటరీ బ్లడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు శ్రీకృష్ణ మజ్జిగ వేతన కార్యక్రమం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఎత్తుకు ఎదిగిన సాయం చేసేవారు తక్కువని అయితే సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు తమ సొంత ఖర్చులు మరియు దాతలు సహకారతం కూడా తోడైతే మరింత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నామన్నారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీకృష్ణ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు అలాగే మా గురువర్యులు మామిడిపల్లి రామారావు లక్ష్మీదంపతులు ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నామని అన్నారు కదా 14 సంవత్సరాలుగా వేసవి మూడు నెలల్లో పాదచర్లకు వాహదారులకు దాహాతిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే అనాధలకు ఫ్రూట్ సలాడ్, లస్సీ, అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాలిక మోహన్ కుమార్, చిరంజీవి, శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *