
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ నవంబరు 02 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణంలోని తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బత్తిని మహేశ్వరి అమృత్ 2.0 పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ప్రజావాణి లో పిర్యాదు చేశారు ఇట్టి సందర్భంగా ఆమె మాట్లాడుతు పట్టణములో నిర్మాణములో ఉన్న అమృత్ 2.0 ప్రాజెక్టు పనులు గత కొన్ని రోజులుగా కాంట్రాక్టరు నిలిపివేసినారు. పట్టణములోని 9వ వార్డు పైప్లైన్ వేయడానికి సి.సి. రోడ్డు తవ్వి గత కొన్ని నెలలుగా అలాగే వదిలేసినారు. దానితో ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తున్నది. తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వార్డు ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయి. అమృత్ 2.0 పనులలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టరుపై తగిన చర్యలు తీసుకొని ఇట్టి పనులు సత్వరమే పనులు పూర్తి చేయించి ప్రజలకు మేలు చేయగలరని ఆమె విజ్ఞప్తి చేసారు ఆమెతో పాటు నాయకులు బత్తిని నాగరాజు ఉన్నారు .
