ఎస్ ఐ ఆర్ ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ వేగంతో జరగడం లేదు

యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు.

పయనించే సూర్యుడు జులై 8 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఈరోజు ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నేతలు కార్యాలయంలో, ఆదోని నియోజకవర్గం ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు యువ నాయకులు సిద్ధార్థ నాయుడు ఎస్ ఐ ఆర్ ఓటర్ వెరిఫికేషన్‌పై విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిద్ధార్థ నాయుడు మాట్లాడుతూ:-, ఆదోని నియోజకవర్గంలో ఎస్ ఐ ఆర్ ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆశించిన వేగంతో జరగడం లేదని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 2,67,980 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు సుమారు 1,20,000 మంది మాత్రమే ఎన్యుమరేషన్ ఫారమ్‌లు సమర్పించారని చెప్పారు.ఇంకా కేవలం ఏడు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్నందున, ఫారమ్‌లు సమర్పించని ప్రతి ఓటరు వెంటనే తమ పరిధిలోని బి ఎల్ ఓ ను సంప్రదించి ఎన్యుమరేషన్ ఫారమ్‌ను అందజేయాలని కోరారు. గడువులోగా ఫారమ్ సమర్పించకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తి చేసిన వారు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పొరుగువారికి అవగాహన కల్పించి వారితో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయించాలని కోరారు.ప్రతి ఓటు విలువైనది – మీ ఓటు హక్కును కాపాడుకోండి! ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు ఆలస్యం చేయకుండా వెంటనే ఎస్ ఆర్ ఐ ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సిద్ధార్థ నాయుడు విజ్ఞప్తి చేశారు.ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, సుబ్బు, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *