పయనించే సూర్యుడు జూలై 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం ఆత్మకూరు నియోజకవర్గం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి జూలై 5 తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు,చేజర్ల ,మరియు చిత్తలూరు గ్రామాలలో పర్యటన సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం లోని కూటమి నాయకులు అందరూ బీజేపీ, తెలుగుదేశం,జనసేన పార్టీ నాయకులు స్టేట్ డైరెక్టర్ లు,మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు,నీటి సంఘాల అధ్యక్షులు,గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల కమిటీ, గ్రామ కమిటీ సభ్యులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇంచార్చ్ లు, తెలుగుదేశం పార్టీ అభిమానులు,కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మిక్కిలి ప్రార్థిస్తున్నాము షేక్.సిరాజుద్దీన్ తెలుగుదేశం పార్టీ చేజర్ల మండల అధ్యక్షులు శనివారం తెలిపారు కార్యక్రమానికి చేజర్ల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు