పయనించే సూర్యుడు న్యూస్ జూలై 06 యడ్లపాడు మండల ప్రతినిధి.. యడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెజ్జం ఏసుపాదం కుమారుడు వంశీ సాగర్ వివాహ వేడుకకు మాజీ మంత్రి విడదల రజిని హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆమె, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యడ్లపాడు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.