కూటమి ధర్మానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలి – సామినేని ఉదయభాను.

పెనుగంచిప్రోలు సెగ్మెంట్‌-2లో టీడీపీ అభ్యర్థికి జనసేన మద్దతు.. జనసేన అభ్యర్థి బీఫామ్‌ ఉపసంహరణ
🖨️ Print

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం నవంబర్ 2 పెనుగంచిప్రోలు గ్రామంలో ని.ఎంపీటీసీ సెగ్మెంట్‌-2లో కూటమి అభ్యర్థి విషయంలో నెలకొన్న పరిస్థితులపై ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను స్పందించారు._ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెనుగంచిప్రోలు ఎంపీటీసీ సెగ్మెంట్‌-2లో తెలుగుదేశం పార్టీ తరఫున మాదినేని విక్రమ్‌కు, జనసేన పార్టీ తరఫున పొద్దుటూరి రాజశేఖర్‌కు బీఫామ్‌లు జారీ అయినట్లు తెలిపారు. అయితే కూటమి ధర్మానికి అనుగుణంగా ఒకే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అభ్యర్థి పొద్దుటూరి రాజశేఖర్‌కు ఇచ్చిన బీఫామ్‌ను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. కూటమి ఐక్యతను కాపాడుతూ, కూటమి ధర్మానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.పెనుగంచిప్రోలు గ్రామంలోని కూటమి నుండి పోటీ చేస్తున్న ప్రతి ఒక్క ఎంపీటీసీ అభ్యర్థిని అలాగే జడ్పిటిసి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత కూటమి శ్రేణులు పై ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *