గొల్లగూడెం గ్రామపంచాయతీలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా.

* ఎటువంటి పరిమిషన్లు ఇవ్వలేదు అంటున్న, జిపిఓ, సెక్రెటరీ. * గ్రామంలో కరువైన అధికారుల పర్యవేక్షణ.

పయనించే సూర్యుడు న్యూస్ :మే 23, తల్లాడ రిపోర్టర్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ నందు గవర్నమెంట్ వారి అనుమతులు లేకుండా మట్టి మాఫియా మారుమోగుతుంది, వివరాలు కెళ్తే గ్రామానికి చెందిన బడా బాబు ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి, తన పొలం పక్కన ఉన్న ఏరు మట్టిని ఒకొక ట్రిప్పు 200 నుంచి 300 రూపాయలకు గ్రామంలోని అమ్మకం జరుపుతున్నాడు. ఇదేమిటని విలేకరుల ప్రశ్నించగా మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. మీకు ఏది నచ్చితే అది రాసుకోండి అంటూ విలేకరులపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఇట్టి విషయంపై విలేకరులు బడా బాబును పర్మిషన్ ఉన్నదా తీసుకున్నారా లేదా అని వివరణ కోరగా విలేకరులపై దురుసుగా ప్రవర్తించడం జరిగినది, ఈ మాఫియా విషయంపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ బడా బాబు పై చర్యలు తీసుకోవలసినదిగా గ్రామ ప్రజలు వాపోతున్నారు. మట్టి మాఫియా పై జిపిఓను గ్రామ సెక్రెటరీ వివరణ కోరగా మాకు సంబంధించి ఎవరు కూడా మా యొద్ద పర్మిషన్ తీసుకోలేదు అని వివరణ ఇచ్చారు, అసలు గ్రామంలో ఏం జరుగుతున్నది అనే విషయం కూడా గ్రామ సెక్రెటరీ తెలియటం లేదు. ఇప్పటికైనా మండల అధికారులు ఈ విషయంపై స్పందించి గ్రామాలపై దృష్టి సాధించవలసినదిగా మండల ప్రజలు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *