టెన్నికాయిట్ రాష్ట్ర పోటీలకు ఎంపికైన బాల బాలికలు

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 8 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. ప్రభుత్వ ఉన్నత పాఠశాల పలాస క్రీడా మైదానంలో మంగళవారం జరిగిన శ్రీకాకుళం జిల్లా సబ్ జూనియర్ బాల బాలికల టెన్నికాయిట్ ఎంపికలకు ముఖ్యఅతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. రవికుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర పోటీల్లో చక్కని ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టెన్నికాయిట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి తవిటయ్య, శ్రీకాకుళం జిల్లా టెన్ని కాయట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం. సంతోష్ కుమార్ ఎస్. వి. జోగారావు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు బి. శంకర్రావు, ఆర్. శ్రీనివాసరావు మరియు జీ.లోకేష్, మధు, బి. తిరుమల, దామోదర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 11, 12 తేదీల్లో ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో జరగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారని తవిటయ్య చెప్పారు. ఎంపికైన బాలురు జట్టు:-కే .గౌతమ్, కార్తీక్ మహారణా, బి. రిషి, ఎం .స్వరాజ్ స్టాండ్ బై గా ఎన్ .ప్రేమ్ కుమార్, కే .లికిత్ బాలికల జట్టు:-ఎన్. దివ్య, శుభశ్రీ సాహూ, పి. యుగున, ఎస్. సంతోషి స్టాండ్ బై గా కె.హేమలత, జి సోనియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *