ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం

జనం న్యూస్ / గంభీరావుపేట 07 జూన్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈరోజు అనగా 6-జూన్ 2026న ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. వి. విజయలక్ష్మి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేస్తూ, ప్రస్తుతం మన భూమిపై నివసిస్తున్న వివిధ జీవరాసులు అంతరించిపోవడం, వాతావరణంలోనీ పెను మార్పులు సంభవించడం,మరియు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం వల్ల జీవరాశులపై ప్రభావము పడి బయోడైవర్సిటీ దెబ్బతింటుందని తెలియజేశారు. కావున భూమండలంపై ఉన్న జీవకోటిని రక్షించడం ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా తీసుకొని, మొక్కలు నాటి, సస్యశ్యామలం చేయాలని తెలిపారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను కళాశాల ప్రాంగణంలో ఉపయోగించకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని బోటనీ,ఎకో క్లబ్ కన్వీనర్ సూచరణ్,మరియు ఎన్ఎస్ఎస్ పి.ఓ. పాక ధర్మపురి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్.ఎం.ప్రభాకర్ మరియు అధ్యాపకులు అధ్యాపకేతర బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *