పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 12 మామిడిపెల్లి లక్ష్మణ్ గ్రామ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ప్లాస్టిక్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్ ప్రకటించారు.గ్రామంలోని కిరాణం,చికెన్ షాపులతో పాటు అన్ని వ్యాపార సంస్థల్లో ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదని ఆదేశించారు.ఈ మేరకు వ్యాపారులకు 15 రోజుల గడువు విధించారు. గడువులోగా ప్రత్యామ్నాయ కవర్లు వాడకానికి మారాలని సూచించారు.15 రోజుల గడువు తర్వాత ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, వినియోగించినా రూ. 5,000 జరిమానా విధించబడుతుందని ఆయన హెచ్చరించారు. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, గ్రామస్తులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్, కార్యదర్శి రాజేష్, గ్రామ సేవా సమితి అధ్యక్షులు అనుపురం చిన్న లింబాద్రి గౌడ్, కారోబార్ కిషోర్ పాల్గొని వ్యాపారులకు అవగాహన కల్పించారు.