భాష్యం స్కూల్స్ పై చర్యలు ఎక్కడ…?

* అధికా ఫీజులు పై ఫిర్యాదు చేసి దాదాపు 10 రోజులు కావుస్తున్న పట్టించుకోని డిప్యూటీ డిఈఒ * ఆర్ పి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రదీప్ డిమాండ్.

పయనించే సూర్యుడు జులై 7 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని డివిజన్ లో ఉన్న భాష్యం 1&2 బ్రాంచ్లు మరియు ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న భాష్యం స్కూల్స్ పై చర్యలు తీసుకోవడం లో డిప్యూటీ డిఈఒ పూర్తిగా విఫలం అయ్యారు అని ఆర్ పి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రదీప్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆదోని పట్టణంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ఆదోని డివిజన్ లో భాష్యం స్కూల్స్ లో ప్రభుత్వం నిబంధనలు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు డొనేషన్స్ రూపంలో దాదాపు వేల రూపాయలు తీసుకుంటున్నారు అని అలాగే స్కూల్స్ లోనే బుక్స్, యూనిఫామ్స్, షూస్, టై తదితర వస్తువులునా అధిక రేట్లు కు విక్రయిస్తూ తల్లితండ్రులు ను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈవిషయం పై గత వారం పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ లో సబ్ కలెక్టర్ కార్యాలయం లో భాష్యం స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు డిప్యూటీ డిఈఒ ఎంఈఒ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికి అయినా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి భాష్యం స్కూల్స్ ను సిజ్ చేయాలి అని అలాగే డిప్యూటీ డిఈఒ పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో నాయకులు ఈసాక్, చిన్న, ఆనంద్, మహేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *