పయనించే సూర్యుడు, జులై 7, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన 100 మంది బీడీ కార్మికులు సోమవారం గ్రామ సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. 1993లో కొన్నే గ్రామ పరిధిలో గల చొప్పరి ఆగమ్మ వారి కుమారులైన చొప్పరి రామయ్య చొప్పరి నరసయ్య వద్ద నాలుగు ఎకరాల భూమిని బీడీ కార్మికులు ఇంటి నిర్మాణం కొరకు కొనుగోలు చేయడం జరిగింది. కానీ అక్కడ భూమిలో నీరు లేకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయాయి, తరువాత ఆ నాలుగు ఎకరాల నుండి ఎకరం 15 గంటల కెనాల్ పోవడం జరిగింది. అట్టి డబ్బులు కూడా బీడీ కార్మికులకు 5,50,000 వేయడం జరిగింది. కెనాల్ పోయిన తర్వాత మళ్లీ ఒకసారి కార్మికులంతా కలిసి ఎవరి ప్లాటు వాళ్లు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో చొప్పరి నరసయ్య వారసులు ఈ భూమి మాది అని బీడీ కార్మికులపై కోర్టులో కేసులు వేయడం జరిగింది. కోట్ల చుట్టూ తిరగలేని పరిస్థితిలో ఉన్న బీడీ కార్మికులు సోమవారం గౌరవ కలెక్టర్ నీ కలసి మాభూమి మాకే ఉండాలి అని వినతిపత్రం అందించారు. దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి భూమికి సంబంధించిన పత్రాలు చూసి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కి బీడీ కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.