పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, రామగిరి, జూన్-09:- మేడిపల్లి గ్రామ రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వారి వ్యవసాయ భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ పనులు చేపడుతున్న జెసిబిని రైతులు బుధవారం అడ్డుకున్నారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, తమకు రావాల్సిన పూర్తి నష్టపరిహారం చెల్లించే వరకు ఎలాంటి పనులను కొనసాగించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. తమ అనుమతి లేకుండా వ్యవసాయ భూముల్లో పనులు చేపట్టి భూములను దెబ్బతీయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల హక్కులను పరిరక్షించాలని, భూములను స్వాధీనం చేసుకునే ముందు చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేసి, అర్హులైన రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులను ప్రారంభించాలని వారు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో కొండు లక్ష్మణ్, బాద్రపు శ్రీనివాస్, బాద్రపు కృష్ణమూర్తి, ఉనగొండ మధుకర్, మండల శంకర్, పనగంటి ప్రశాంత్, మండల శ్రీనివాస్, సాగర్ల తిరుపతి, ఎరుకల బక్కయ్య, భద్రపు రంగయ్య, బర్ల వెంకన్న, తిరుపతి రెడ్డి, తొట్ల మహేష్ తదితర రైతులు పాల్గొన్నారు.