పయనించే సూర్యుడు జూలై 09 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామం రూ. 32 లక్షల నిధులతో ప్రగతి బాట పట్టింది. గ్రామంలో రూ. 24.5 లక్షల వ్యయంతో పూర్తయిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, రూ. 7.5 లక్షలతో చేపట్టనున్న కొత్త పనుల శంకుస్థాపన కార్యక్రమాలు రాయపల్లి గ్రామ సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్బీ, బిజేపీ రాజాపూర్ మండల ఉపాధ్యక్షులు, గ్రామ ఉప సర్పంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు (ఎంపీ) డీకే అరుణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయపల్లి గ్రామ సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు పాలెం ప్రవీణ్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించి గ్రామస్థుల , డప్పుల చప్పుళ్ల మధ్య తిలకం దిద్ది, ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో రూ. 12 లక్షల వ్యయంతో పూర్తి చేసిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని, రూ. 10 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా రూ. 2.5 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఐ-మ్యాక్స్ ఐ మాక్స్ లైట్లను ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం, రూ. 7.5 లక్షల నిధులతో నిర్మించనున్న స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ (కంపౌండ్ వాల్) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ ప్రగతి ఉత్సవంలో పలువురు బీజేపీ ముఖ్య నేతలు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలాత్రిపుర సుందరి, నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర నాయకులు ముచర్ల జనార్ధన్ రెడ్డి, జడ్చర్ల నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పులమోని నర్సింలు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాపోతుల శ్రీను, బీజేపీ రాజాపూర్ మండల అధ్యక్షులు కాటెపాగ ఆనంద్, ఎబివిపి నాయకులు హన్మగళ్ల బాలరాజ్ ,పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ , మాజీ సర్పంచ్ కమ్మదనం నర్సింలు గౌడ్, ఆశ వర్కర్ కిష్టారం మాధవి తో పాటు వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు,పంచాయతీ సిబ్బంది ,బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.