పయనించే సూర్యుడు జులై 9 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ మండల పరిధిలోని వట్టెం గ్రామంలో బుధవారం నాడు ఎస్ఐఆర్ (SIR) సర్వే ప్రక్రియను మండల తాహసిల్దార్ (ఎమ్మార్వో) మునీరుద్దీన్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న ఓటర్ల సర్వే తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. సర్వే సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న తాహసిల్దార్, ఓటర్ల జాబితా నమోదు, సవరణల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఎలాంటి తప్పులు దొర్లకుండా సర్వే పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బూత్ స్థాయి అధికారులు (BLAలు), గ్రామ రెవెన్యూ సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానిక ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.