విద్యారంగ సేవలకు గుర్తింపుగా అంబటి శాంతయ్యకు ఘన సన్మానం

పయనించే సూర్యుడు జులై 07 , (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : నాలుగు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన నాగులవంచ గ్రామానికి చెందిన రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్యను సీపీఎం నాయకులు ఘనంగా సన్మానించారు. నాగులవంచలోని వీవీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సీపీఎం శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించడంలో అంబటి శాంతయ్య విశేష కృషి చేశారని కొనియాడారు. విద్యా సేవలను సమాజం గుర్తించి గౌరవించడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజానికి సేవలందించిన వ్యక్తులు యువతకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, డివిజన్ నాయకులు పాపినేని రామ నరసయ్య, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కళ్యాణపు వెంకటేశ్వర్లు, సీపీఎం డివిజన్, మండల నాయకులు, తోటకూరి వెంకటనరసయ్య, ఆలస్యం రవి, రౌతు అప్పారావు, కందరబొయిన కొండలరావు, మేరా సాహెబ్, అన్నేగాని వీరబాబు, సామినేని అప్పారావు, కన్నెగాని కృష్ణ, అంబటి ఖాదర్, మర్రి శ్రీను, కంభం శ్రీను, హుస్సేన్ సాహెబ్, యరదేశి నరసింహారావు, లింగం సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *