పయనించే సూర్యుడు న్యూస్ జూలై 7 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమేష్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్ 9 శ్రీనివాస గార్డెన్ ఎదురుగా ఆర్ ఆర్ నగర్ రోడ్ నెంబర్ వన్ మరియు టు లో ఉన్న కాలనీవాసుల కష్టాలు సమస్యలు తీర్చండి అని సోమవారం రోజున కలెక్టర్ సమక్షంలో ప్రజా పాలనలో దరఖాస్తులు పెట్టుకున్న కాలనీవాసులు ఆర్ఆర్ నగర్ కాలనీ ఏర్పడినప్పటి నుండి గత పది సంవత్సరాలుగా పాలకవర్గాలు పట్టించుకున్న పాపాన పోలేదని 9వ వార్డు రోడ్ నెంబర్ వన్ మరియు టు కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై మురికి నీరు చేరుకుని చెరువులు తలపిస్తున్న వైనం రోడ్లు పైపైకి కాలువలు లోతుగా ఉండి మురికి నీరు చేరుకుని నిండి నిలువ ఉండడంతో రోడ్డుపైన వెళ్లే జంతువులు పశువులు కాలువలో పడి మృతి చెందిన వైనం చాలా సంఘటనలు ఉన్నాయని కోకొల్లలు అని కాలనీవాసులు వాపోయారు మరియు అంతర్గత రోడ్ల గురించి ప్రజా పాలనలో కలెక్టర్ కు విన్నవించిన ఆర్ఆర్ నగర్ కాలనీ వాసులు ఇకనైనా ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ అధికారులు మా యొక్క తొమ్మిదవ వార్డు సమస్యలు తీర్చగలరని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మందల రాజిరెడ్డి కార్యదర్శి కే కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు మచ్చ రాజేశ్వర్ మరియు విశ్రాంతి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు సుంకే విజయ్ కుమార్, అధ్యక్షులు చల్లారాజిరెడ్డి కార్యదర్శి ఆశాడపు రామన్న కోశాధికారి సుతారి భూమన్న మరియు వారి కార్యవర్గ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు…