వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 9 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానేత, ఓటమి ఎరుగని నాయకుడు, రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికిన దివంగత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా అశ్వరావుపేటలో ఆయన విగ్రహానికి మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూపల్లి రమేష్ బాబు మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించి కోట్లాది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మండల యూత్ నాయకులు జూపల్లి ప్రమోద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తుమ్మ రాంబాబు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నండ్రు రమేష్, మండల కాంగ్రెస్ నాయకులు కాసాని పద్మశేఖర్, తాడేపల్లి రవి, కోల లక్ష్మీనారాయణ, సురానేని ఫణి , వేల్పుల సత్యనారాయణ, పైడి శ్రీనివాసరావు,వార్డ్ కౌన్సిలర్లు దండాబత్తుల ఆదిలక్ష్మి, కొట్టే నాగసునీతతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *