సూరంపల్లి గ్రామంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ( ఎస్ ఐ ఆర్ ) పూర్తి చేయాలి

పయనించే సూర్యుడు జులై 7 రాజేష్ ) సూరంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ( స్పెషల్ ఇన్విటేషన్ రివిజన్ ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమం పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించబడింది. గ్రామంలోని ప్రతి ఓటరు వివరాలను 100 శాతం సరిచూసి పక్కాగా నమోదు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు నమోదు ప్రక్రియ చేపట్టబడింది. అలాగే ఓటర్ కార్డుల్లో ఉన్న తప్పులు—పేరు, వయస్సు, తండ్రి/భర్త పేరు, చిరునామా వంటి వివరాల సవరణను కూడా నిర్వహించారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు నమోదు ఉండటం, బోగస్ ఓట్లు, మరణించిన వారి పేర్లు, అలాగే గ్రామం వదిలి శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించే ప్రక్రియను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టారు. ప్రతి ఓటరు వివరాలను సమగ్రంగా పరిశీలించి ఆన్లైన్ ద్వారా ఓటర్ మ్యాపింగ్ చేయడం ద్వారా ఖచ్చితమైన డేటాబేస్ రూపొందించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. గ్రామంలోని ప్రతి అర్హత కలిగిన వ్యక్తికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ కొనసాగినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ రావు, ఆరవ వార్డు మెంబర్ బొల్లం రాజేష్, బూత్ లెవెల్ అధికారి ( బి ఎల్ వో ) బాలమణి, రజిని కుమారి, ఆశా వర్కర్ రేణుక, బొమ్మరాజు అనితతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *