ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్) పై కాంగ్రెస్ బూత్ లెవెల్ సమావేశం.

పయనించే సూర్యుడు జూలై 7 తొర్రూర్ మండలం మహబూబాబాద్ జిల్లా, రిపోర్టర్ శ్రీధర్. తొర్రూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం టౌన్ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ మరియు మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ ల సమావేశం నిర్వహించారు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఓటర్ నమోదుపై సుదీర్ఘంగా చర్చించారు. 2002 సంవత్సరం ఓటర్ జాబితాలోని అంశాలు ప్రస్తుతం ఓటర్ నమోదు విధానంపై బూత్ లెవెల్ ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు మున్సిపాలిటీ పరిధిలోని 21 బూత్ లలో కొత్త ఓటర్ల నమోదు మార్పు చేర్పులు ఎలా చేయాలనే విషయంపై ఈ సమావేశంలో బి ఎల్ ఏ లకు అవగాహన కల్పించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *